తెరపై అద్భుతమైన మరో ప్రపంచాన్ని చూశాను: '2.ఓ' గురించి అనిరుధ్

  • శంకర్ మాస్టర్ డైరెక్టర్ 
  • నటన పరంగా విశ్వరూపం చూపించారు 
  • శ్రమకి తగిన ఫలితం దక్కుతుంది  
ఇటు రజనీ .. అటు అక్షయ్ అభిమానుల నిరీక్షణకు తెరదించేస్తూ '2.ఓ' ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. '2.ఓ' సినిమా చూసిన సినీ ప్రముఖులు తమదైన శైలిలో టీమ్ ను అభినందిస్తున్నారు. సంగీత దర్శకుడు అనిరుధ్ కూడా ఈ సినిమా చూసి స్పందించాడు. "ఈ సినిమాను చూస్తున్నంత సేపు తెరపై మరో అద్భుతమైన ప్రపంచాన్ని చూసిన అనుభూతి కలిగింది. మళ్లీ .. మళ్లీ చూడాలనిపించేంత గొప్పగా ఈ సినిమా వుంది.ఈ సినిమాతో ఇండియన్ బాక్సాఫీస్ రికార్డులన్నీ రజనీకాంత్ కి దాసోహం అనడం ఖాయం. శంకర్.. మాస్టర్ డైరెక్టర్ .. ఆయన పనితనం గురించి చెప్పడానికి మాటలు చాలవు. రజనీ .. అక్షయ్ .. ఎమీ జాక్సన్ నటన పరంగా తమ విశ్వరూపం చూపించారు. ఈ సినిమా కోసం వేలాదిమంది పడిన కష్టం తెరపై కనిపించింది. ఆ శ్రమకి తగిన ఫలితం దక్కుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు" అంటూ తన మనసులోని మాటను చెప్పుకొచ్చాడు.    
Go Back to Shorts
rajani
akshay

More Telugu News